Saturday, September 10, 2011

om namashivaya.srirastu.shubhamastu.

4 comments:

  1. ఎదలోనివేదన/ఎదలో(ని)వేదన/ఎదనివేదన/ఎద(లోయ)నివేదన.
    రచనాకాలం.13.01.1983.

    ఇది అనుస్రుజనగీతం.(స్వర్గీయ వేటూరి గారికి నివాళిగా సమర్పణ)
    రాగమా, నాహ్రుదయానురాగమా
    వేగిరపడి సాగనీకుమా నీపయనం
    సాగినా, పొంగినా మిగులునే శూన్యం = రాగమా=
    కలతలకు తోడైన కన్నీరుగా
    వినిపించని చిరుమువ్వలసవ్వడిగా
    అడవిలో వెన్నెల మల్లెల జలపాతంగా
    నిటూర్పులుగా మిగిలిన నిన్నటి తీపిగుర్తులుగా
    చితిలో నిలిచి వెలిగే మంటలుగా
    ఎడారిలో వానకోయిల పాటగా =రాగమా=
    నేటికలలు రేపటి ఆశలకు పొదరిండ్లు
    చేరువలో నువ్వుంటే దరిజేరవు కన్నీళ్ళు
    ఆకాశంలా సువిశాలమైందీ హ్రుదయం
    చిరుగుల గాలిపటంలా ఎగురలేదు పాపం
    చమురు తగ్గి గుడ్దిగా వెలిగేను దీపం
    గాలి వీచిన వేళ అలుముకునేను అంధకారం =రాగమా=
    మ్రుత్యువు రాకకై ఈనాడీ స్వాగత *గీత తోరణం
    ఆశ అవేదన నడుమ గడిపేను అనుక్షణం
    ఆసన్నమైనది జీవన సంధ్యాసమయం
    అందుకే ఈ ఆక్రోశం, ఆగనిది జీవనపోరాటం
    మంచుశిల్పం ఆలాపిస్తుంది మౌనగీతం
    ఆనందంతో నీవు పాడాలి వీడ్కోలు గీతం. =రాగమా=

    దర్శకుదు వంశీగారు తొలిసారి దర్సకత్వం వహించిన సినీమా "
    మంచుపల్లకి " హైదరాబాద్, నల్లగొంద, సూర్యాపేట మొదలగు
    పట్టణ్ణాల్లో చూసినప్పుదు కలిగిన కన్నీటిభావనలకు
    అక్షరరూపమే ఈ గీతం. * గీత ఈ సినీమాలోని హీరోయి పేరు.వానదేవుడు కరుణించి
    కార్తెలకాలంలోనే వర్షాలు కురిపిస్తాడూ సమ్రుద్ధిగా పంటలు పండుతాయాన్న కోటి
    ఆశలతో ఉన్నవన్నితెగనమ్మి విత్తనాలు చల్లిందీ కర్షకలోకం చుక్కరాలక
    దిక్కుతోచక వానచుక్కకోసం ఆకాశంకేసి ఎదురుచూపులతో ఏడిచ్చిమొత్తుకున్నా
    కనుచూపు మేరలో మేఘం జాడ కానపడదాయి పాడియావు వంటి వ్యవసాయం పడావుపడి
    వున్నవూరుకన్న దున్నిన నేలకన్న పెంచిన అమ్మ కన్న ఆ కాడు(అడవి) మిన్న అని
    వెతలగోసలతో తలపోసి వలసగా వనవాసమేగపోదామని చాటింపు చేసి సాగే తరుణంలో
    అదేమిచిత్రమో ఈతరుణం దప్పిందా తనను ఈజనం నన్ను ఆగమాగంగా తిట్టి సాపిసంచి
    సానిపిజల్లుతారన్న అదురుతో గాలిదేవుదికి మొక్కి అయ్యా నువ్వు కాస్తా ఆగవయ్య
    తంద్రిఎ అనిబతిమాలి వరుణుడు ఆగమేఘాలతో అచ్చి కురవంగా కుంటలు, చెరువులు
    నిండంగా అలుగులు పోయంగా. అలిగిన మడుసులంతా కురిసిన జల్లులతో మురిసిన మడులతో
    వనవాసం కాస్తా వాన(దరహస) వాసంగా మారింది

    ReplyDelete